Friday, April 25, 2025

గీత దాటితే వాతే

- Advertisement -
- Advertisement -

పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడితే
వారే ఇబ్బందుల్లో పడతారు మంత్రివర్గ
విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్
తెలంగాణ పథకాలతో మోడీ ఉక్కిరిబిక్కిరి
బిఆర్‌ఎస్, బిజెపిలు కలిసి ప్రజాప్రభుత్వంపై
విషప్రచారం పార్టీ ప్రతిష్ఠ పెరిగితేనే
ప్రభుత్వం ఉంటుంది మళ్లీ గెలవాలంటే
ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లాలి సంక్షేమ
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి నేటి
నుంచి జూన్ 2 వరకు ఎంఎల్‌ఎలు గ్రామాల్లో
పర్యటించాలి నేను కూడా మే 1 నుంచి
జూన్ 2 వరకు ప్రజలతో మమేకమవుతా
పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఎంఎల్‌సిలకు
క్లాస్ తీసుకున్న సిఎం రేవంత్‌రెడ్డి ప్రతి
కాంగ్రెస్ ఎంఎల్‌ఎ తన జీతం నుంచి
రూ.25వేలు పార్టీకి ఇవ్వాలని సిఎల్‌పి నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలకు సిఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ లోని నోవాటెల్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మా ట్లాడుతూ ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన తే ల్చి చెప్పారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడితే ఆ తర్వాత ఆ నేతలే ఇబ్బందు లు ఎదుర్కొంటారని ఆయన పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఎమ్మెల్యేలకు ఆ యన సూచించారు. మంత్రి వర్గ విస్తరణ పై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని కేబినెట్ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని ఆయన కుండబద్దలు కొ ట్టారు. మంత్రి పదవులపై ఒకరికి మించి మరొకరు లీకులు ఇస్తున్నారని ఆయన అ సహనం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మంత్రి పదవులు రావన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు.

మంత్రి వర్గ విస్తరణపై అధిష్టానం ఇప్పటికే చర్చలు జరిపిందని, ఈ విషయంలో ఎవరూ ఊహాగానాలు చేయొద్దని సిఎం హెచ్చరించారు. కొందరు నాయకు లు ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల పా ర్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, ఇకపై జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి హె చ్చరించారు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని, భయపడే పరిస్థితిలో పార్టీ లేదని ఆయన పేర్కొన్నారు. అద్దంకి దయాకర్ మాదిరిగా ఓపికతో ఉండాలని, దయాకర్ ఓపికగా ఉన్నందుకే ఎమ్మెల్సీ అయ్యారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేటి నుంచి జూన్ 2వ తేదీ వరకు ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించాలని సి ఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తాను కూ డా మే 1వ తేదీ నుంచి జనాల్లోకి వెళ్తానని ఆయన పేర్కొన్నారు నిన్న, మొన్నటి వర కు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలపై ప్రభుత్వంపై విమర్శలు చేశారని, ఇప్పుడు ఏ కంగా ప్రధాని మోడీయే రంగంలోకి దిగారని, తెలంగాణ పథకాలతో మోడీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే కష్టపడాలని సిఎం పిలుపునిచ్చారు.

వీకెండ్ రాజకీయాలు చేయొద్దు
ప్రభుత్వంపై విపక్షాలు నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కొందరు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలను వదిలి హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని వీకెండ్ రాజకీయాలు చేయొద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ హితవు పలికారు. ఎవరెవరూ ఏం మాట్లాడుతున్నారన్నది అంతా రికార్డ్ అవుతూ ఉందని జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే తన జీతం నుంచి రూ.25 వేలు పార్టీకి ఇవ్వాలని సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. అందరూ కార్యకర్తలు, పార్టీ నేతలు కాంగ్రెస్ కోసం పనిచేయాలని సిఎం రేవంత్ సూచించారు.

భూభారతి పోర్టల్‌ను రైతులకు చేరువ చేయాలి
భూభారతి పోర్టల్‌ను రైతులకు చేరువ చేయాలని సిఎం రేవంత్ సూచించారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులకు సిఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గతంలో రూ.2లకే కిలో బియ్యంతో పాటు ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని సిఎం రేవంత్ తెలిపారు. దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదర్శంగా నిలుస్తోందని సిఎం రేవంత్ అన్నారు. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను పరిష్కరించామని ఆయన అన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎస్సీ ఉపకులాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. కేంద్రానికి వర్గీకరణ వారికి ఓ గుదిబండలా మారిందన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ చర్చ జరుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములపై బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలో ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్‌లు చేసి ప్రభుత్వంపై విష ప్రచారం చేశారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ప్రధాన లక్ష్యం రెండోసారి అధికారంలోకి రావడమే
మన ప్రధాన లక్ష్యం రెండోసారి అధికారంలోకి రావడమని సిఎం సూచించారు. అందుకు అనుగుణంగా అందరూ పని చేయాలని ఆయన ఆదేశించారు. నియోజకవర్గాల్లో పట్టు సాధించడానికి మన ఫోకస్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరోసారి మీ నియోజకవర్గంలో మీరు గెలవడానికి కావాల్సిన ప్రాజెక్టులు తెచ్చుకోవాలని సిఎం రేవంత్ సూచించారు. వాటిని పూర్తి చేయించే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతేకాదు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సిఎం సూచించారు. మీరు పర్యటనలు ముగించాక, తనతో అపాయింట్‌మెంట్ తీసుకుని మాట్లాడొచ్చన్నారు. ప్రతి నియోజకవర్గ అవసరాలను పరిశీలిస్తానని రేవంత్ పేర్కొన్నారు.

12 మందికి ఇందిరమ్మ చెక్కులను అందచేసిన సిఎం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెక్కులను సిఎం రేవంత్ పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు సంబంధించిన 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల చెక్కులను ఆయన అందచేశారు. ఈ లబ్ధిదారుల్లో రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల వాసులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లుకు సంబంధించి మొట్టమొదటి బిల్లును దేవరకద్రకు చెందిన తెలుగు లక్ష్మి, మరికొందరు లక్ష రూపాయల చెక్కును అందుకున్న వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News