Sunday, December 22, 2024

ఆస్పత్రిలో సోదరుడిని పరామర్శించిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి రాగానే బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా మాదాపూర్ మెడికోవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరుడిని పరామర్శించారు. గురువారం గుండెపోటుకు గురై మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సోదరుడు తిరుపతి రెడ్డి ఆరోగ్యపరిస్థితి గురించి సిఎం వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గురువారం తిరుపతి రెడ్డికి హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తిరుపతిరెడ్డికి హైదరాబాద్‌లోని మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News