Wednesday, January 22, 2025

మానవత్వాన్ని చాటుకున్న సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

కెబిఆర్ పార్కు వద్ద అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సిఎం కాన్వాయ్

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన కాన్వాయ్ మధ్యలో నుంచి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. శనివారం ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే క్రమంలో కెబిఆర్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఓ అంబులెన్స్ అటుగా వచ్చింది. ఇది గమనించిన సిఎం అంబులెనున్స్‌కు దారి ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీంతో సిఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు దారిచ్చింది.

అటుగా వెళుతున్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దంటూ సిఎం ఇదివరకే అధికారులను ఆదేశించారు. తాను బయలుదేరడానికి చాలా సేపటి ముందు నుంచే ట్రాఫిక్ నిలిపివేయొద్దని, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News