హైదరాబాద్: సచివాలయంలో కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నష్టంపై కేంద్ర బృందంతో సిఎం రేవంత్ చర్చిస్తున్నారు. రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి సీఎం పలు విజ్ఞప్తులు చేసినట్లు తెలుస్తోంది. వరదలతో తీవ్ర నష్టం జరిగిందని.. ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ కోరారు.
భవిష్యత్ లో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కేంద్ర బృందాన్ని సీఎం కోరారు.అలాగే.. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణంలో శాశ్వత పరిష్కారం తీసుకోవాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మున్నేరు వాగు అల్లకల్లోలం సృష్టించింది.భారీ వరదలు ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఇండ్లు, వాహనాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే.