Saturday, December 21, 2024

హరీశ్ రావుపై సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోసం చేయాలనుకున్న ప్రతిసారి హరీశ్ రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తుందని ప్రశ్నించారు. హరీశ్ రావు.. పంద్రాగస్టులోగా రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు సిఎం. హరీశ్ రావు సవాల్ ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. హరీశ్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారు.. రాజీనామా లేఖ అలా ఉండదన్నారు. స్వీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా చెల్లదని సూచించారు. హరీశ్ రావు రాజీనామా లేఖను తన మామ సీస పద్యమంత సైజులో రాసుకొచ్చారని ఎద్దేవా చేశారు.

చాంతాడంత రాసి రాజీనామా లేఖ అంటారా? అని ప్రశ్నించారు. హరీశ్ రావు తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్లుందన్నారు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై సిఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.  దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బిజెపి విధానమని అన్నారు. ఆనాడు బ్రిటీషర్లు సూరత్ చేరుకుని క్రమంగా దేశమంతా ఆక్రమించుకున్నారు. ఇప్పుడు కూడా సూరత్ వ్యాపారులు దేశాన్ని ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. బిజెపి అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బ్రిటీష్ వాల్ల వలే బిజెపి వాళ్లకు కూడా రిజర్వేషన్లు నచ్చవన్నారు. నేను ఉంటే తన కుట్రలు సాగవని కెసిఆర్, కెటిఆర్ భావిస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి, బిఆర్ఎస్ కుట్రలను ఎంపి ఎన్నికల్లో మరోసారి తిప్పికొట్టాలని ప్రజలను సిఎం పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ సైనికులు మరోసారి అవిశ్రాంతంగా పోరాడాలని రేవంత్ రెడ్డి కోరారు. కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేయాలని బిజెపి భావిస్తోందన్నారు. ఇప్పటికే రూ. 60లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలను మోడీ అమ్మేశారని ఆయన ఆరోపించారు. 13 మంది ప్రధానులు చేసిన అప్పుకంటే రెట్టింపు అప్పు నరేంద్ర మోడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అప్పు ఎందుకు చేశారని అడిగితే ‘అయోధ్యలో గుడిలో కట్టానని అంటారు.. ‘జైశ్రీరామ్ అంటారు’ అని ఆయన వెల్లడించారు. కెసిఆర్ కూడా ఎందుకు ఇంత అప్పు చేశారని అడిగితే ‘జై తెలంగాణ’ అన్నారు అని గుర్తుచేశారు. ఇన్నాళ్లు బిజెపి వాళ్లు రాముడి ముసుగు వేసుకుని రాజకీయం చేశారని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News