Thursday, January 23, 2025

కెసిఆర్ పై సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

పోడు భూముల సమస్యలపై కెసిఆర్ దృష్టి పెట్టలేదని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆసిఫాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి బిజెపి కూడా కృషి చేయలేదన్నారు. కేంద్ర మంత్రివర్గంలో గోండులకు బిజెపి స్థానం ఇవ్వలేదన్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు గోండులు, లంబాడ హక్కులను కాపాడలేదని మందిపడ్డారు. ఇంతవరకు ఆదిలాబాద్ లోక్ సభ టికెట్ ను మహిళలకు ఏ పార్టీ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తొలిసారిగా ఆదిలాబాద్ ఎంపి టికెట్ ను మహిళలకు కేటాయించామని తెలిపారు. సామాన్య ప్రభుత్వ ఉద్యోగికి ఆదిలాబాద్ ఎంపి టికెట్ ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆత్రం సుగుణ పోరాడుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News