మన తెలంగాణ /సిటీ బ్యూరో: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం లంగర్ హౌజ్, బాపూఘాట్ వద్ద ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ సమాది వద్ద పుష్పగుచ్చాలతో బాపూజీకి నివాళ్లు అర్పిం చిన సిఎం అనంతరం సర్వమత ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ సంగీతం , నృత్య కళాశాల బృందం బాపూజీకి ప్రియమైన భజన గీతాలను ఆలపించారు. హిందు, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంధాల నుండి మత పెద్దలు పఠించిన ప్రవచనాలను సిఎంతో పాటు పలువురు ప్రముఖులు ఆలకించారు.
బాపూఘాట్ ఆవరణలో గల గాంధీజీ విగ్రహానికి పూలు వేసి నివళులర్పించారు. ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి శాంత కుమారి,డి జి పి రవిగుప్తా,జిఏడి సెక్రటరీ అర్విందర్ సింగ్, జి హెచ్ ఎం సి కమిషనర్ రోనాల్ రోస్, నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టరు మధుసూదన్, ఆర్థిఓ సూర్యప్రకాష్‌తో పాటు పలువురు ప్రముఖులు మహాత్మాగాంధీకి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో టూరిజం అధికారులు, గొల్కొండ తహాసీల్దారు అహల్య, ఆర్ అండ్ బి, ట్రాన్స్ కో, సమాచార, జిహెచ్‌ఎంసి, వాటర్ వరక్స్, హార్టికల్చర్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.