Monday, December 23, 2024

మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి సిఎం రేవంత్ రెడ్డి నివాళి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు నివాళులు అర్పించారు. రేవంత రెడ్డి మాట్లాడుతూ ‘జైపాల్ రెడ్డి తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. ఆయన ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణలో పాలన సాగిస్తాం’’ అన్నారు.

ఈ నివాళి కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News