Sunday, December 22, 2024

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి (జులై 17) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తెలంగాణ ప్రజలందరూ ఏడాదిలో వచ్చే పండుగలకు ఇదే మొదటి పండుగగా జరుపుకుంటారన్నారు. తొలి ఏకాదశి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ప్రా ర్థించారు.

ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రైతుల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలని, ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News