Tuesday, December 24, 2024

కన్యాకుమారిలో క్రిస్‌మస్ వేడుకలకు సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడులోని కన్యాకుమారి పర్యటనకు సోమవారం సాయంత్రం వెళ్లారు. సోమవారం అక్కడ జరిగే క్రిస్మస్ వేడుకల్లో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. కన్యాకుమారి ఎంపి విజయ్‌వసంత్ ఆహ్వానం మేరకు సిఎం రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి సిఎం రేవంత్ మొదటగా తిరువనంతపురం చేరుకున్నారు. అక్కడి నుంచి సిఎం కన్యాకుమారి చేరుకున్నారు.

రాత్రి కన్యాకుమారిలోనే సిఎం బస చేసినట్టుగా తెలిసింది. కన్యాకుమారిలో జరిగే క్రిస్‌మస్ వేడుకల్లో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు సాయంత్రానికి సిఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి చేరుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News