Tuesday, September 17, 2024

ఇవాళ IIHT ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

చేనేత రంగంలో ఆధునిక పద్దతులపై శిక్షణ
యవతకు మెరుగైన ఉపాధి కల్పించడమే లక్షం
నేతన్నకు చేయూత కింద రూ.290కోట్లు విడుదల: మంత్రి తుమ్మల
మనతెలంగాణ/హైదారాబాద్: చేనేత రంగంలోఆధుకిన పద్దతులపైన శిక్షణ కల్పించి తెలంగాణ యువతకు మెరుగైన ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్షం అని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆదివారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టి)కి ప్రారంభోత్సవ కార్యక్రమం లలితా కళాతోరణం వేదికగా జరుగుతుందని తెలిపారు.

చేనేత రంగంలోని కొత్త పద్దతులలో శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇప్పటివరకు దేశంలో కేవలం ఆరు ప్రదేశాలలో మాత్రమే ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత, ఈ ప్రాంతానికి సేవలందిస్తున్న ఐఐహెచ్‌టి సంస్థ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉన్నందున అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మారిందని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్షం కారణంగా ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రాంతంలో ఐఐహెచ్‌టీ ఏర్పాటు కాలేదన్నారు.

తెలంగాణలో ఐఐహెచ్‌టి అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ ప్రాంత విద్యార్థులు చేనేతలో సాంకేతిక నైపుణ్యం పొందేందుకు ఆంధ్రాలోని ఐఐహెచ్‌టి వెంకటగిరి లేదా ఒరిస్సాలోని ఐఐహెచ్‌టి బర్గాకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఈ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం 60 విద్యార్థులకు చేనేత, టెక్స్ టైల్ సాంకేతికతలో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సును అభ్యసించడానికి అవకాశం కలుగుతుందని, 3 సంవత్సరాల శిక్షణ తర్వాత విద్యార్థులకు చేనేత , టెక్స్టైల్స్ లో డిప్లొమా అందజేస్తామన్నారు. ఈ డిప్లొమా ప్రభుత్వ టెక్స్ టైల్ ఇన్‌స్టిట్యూట్‌లతో పాటు ప్రైవేట్ టెక్స్ టైల్ , అపెరల్ ఇండస్ట్రీస్, ఫ్యాషన్ సెక్టార్‌లలో ఉత్పత్తి, క్వాలిటీ కంట్రోల్ మరియు మార్కెటింగ్ విభాగాలలో లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు.

తెలంగాణలో ఐఐహెచ్‌టి సంస్థను ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ యువత ప్రధానంగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు తమ సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగు పరుచు కోవడంతోపాటు ఇతర సామాజిక వర్గానికి చెందిన వారిని కూడా చేనేత రంగం వైపు ఆకర్షణ కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ. 290 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News