- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సభ్యుల భూ కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ పంపిణీ చేశారు. 73 మంది జర్నలిస్టులు ఇళ్ల కోసం ఎదురు చూసి చూసి ప్రాణాలు విడిచారన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ మా ప్రభుత్వం వచ్చాక స్పీకర్ కు నేనే అసెంబ్లీ లోపలికి జర్నలిస్టులను అనుమతించాలని కోరా. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు, ఇళ్ల పట్టా, హెల్త్ కార్డు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంటుంది. అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తాం’’ అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ భూ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -