Wednesday, January 22, 2025

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్..!

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం ఢిల్లీలో తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రుల సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది.

ఇటీవల వరదల నష్టంతో తెలంగాణకు రూ.10వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందించగా.. పరిహారంగా కేంద్రం రాష్ట్రానికి కేవలం రూ.421కోట్లు మాత్రమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరింత సాయం చేయాలని సీఎం రేవంత్, కేంద్ర మంత్రులను కోరనున్నట్లు సమాచారం. అలాగే, కాంగ్రెస్ అగ్రనేతలనూ సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News