హైదరాబాద్: ఆరు గ్యారెంటీల హామీ పత్రం బడ్జెట్ అని, ఆర్భాటాపు అంకెలు కాకుండా వాస్తవపు లెక్కల బడ్జెట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2024-25కు సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ఉపముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ఇది ఆరు గ్యారెంటీల బడ్జెట్ అని స్పష్టం చేశారు.తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్ ను రూపిందించిన భట్టి విక్రమార్క, ఆయన బృందానికి అభినందనలు అంటూ రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలు ,రాష్ట్రాభివృద్ధి,
పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకుని
రూపొందించిన బడ్జెట్ ఇది.ఆరు గ్యారెంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్.
ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవపు లెక్కల బడ్జెట్ ఇది.
కేంద్రం వివక్ష… గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య…తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా…
ఈ… pic.twitter.com/icSUjgNlY2— Revanth Reddy (@revanth_anumula) July 25, 2024