Sunday, April 20, 2025

పెట్టుబడులపై జపాన్ లో సిఎం రేవంత్ ప్రజెంటేషన్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం సిఎం రేవంత్ జపాన్ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయన ఈ నెల 15న జపాన్ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ పార్ట్‌నర్‌షిప్‌కు హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జపాన్‌ పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్‌ ఆహ్వానించారు. లైఫ్‌సైన్సెస్‌, ఏఐ, ఈవీ, ఎలక్ట్రానిక్స్‌, టెక్స్‌టైల్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం పలికారు. ఇవాళ జపాన్‌లో తెలంగాణ ఉదయిస్తోందని..
అభివృద్ధిలో టోక్యో నుంచి ప్రేరణపొందుతున్నామని సిఎం రేవంత్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News