Sunday, February 16, 2025

పంచాయతీరాజ్‌ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

పంచాయతీరాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బుధవారం సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర రాజనరసింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, కె.కేశవరావు, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, వచ్చే నెల చివరి వారంలో రాష్ట్ర ప్రభుత్వం.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News