Friday, December 20, 2024

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేడు సిఎం సమీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్న సమస్యలన్నింటినీ ప రిష్కరించి ఒక నిర్ధిష్టమైన కాలపరిమితి లో గా షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టు నిర్మాణాలకు గడువును ఖరారు చేసేందుకు వీలు గా బుధవారం (ఈనెల 6వ తేదీన) ముఖ్యమంత్రి కెసిఆర్ నీటిపారుదల శాఖ, రెవెన్యూ, ఆర్ధికశాఖల ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించనున్నారు.

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టులోని నార్లాపూర్ పంప్ హౌస్ ఇటీవల ఇంజనీరింగ్ అధికారులు డ్రైరన్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారని, అందుచేతనే ఈనెలాఖరులోగా ఆ ప్రాజెక్టు ను ప్రారంభించేందుకు ఈ సమీక్షా సమావేశంలో ముహూర్తం కూడా ఖరారు చేసే అవకాశాలున్నాయని కొందరు అధికారులు తెలిపారు. అందుకే ఈ ప్రాజెక్టు పరిథిలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొనే వి ధంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో నెలకొన్న కరువు ప రిస్థితులను పారద్రోలడానికి ఉద్దేశించిన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రా జెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) స్టేతో ఏకంగా అయిదేళ్ళపాటు నిర్మాణా ల్లో అంతులేని జాప్యం జరిగింది. ఇటీవల నే స్టే ఎత్తివేయడం, ప్రాజెక్టు నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంతో ఇం జనీర్లు, కాంట్రాక్టు ఏజన్సీ రేయింబవళ్ళూ ప్రాజెక్టు నిర్మాణం పనులు చేస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News