భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మూత్రం బాధితుడి కాళ్ళు కడిగి సన్మానించారు. ఇటీవల సిద్ధి జిల్లాలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు ప్రవేశ్ శుక్లా, ఓ గిరిజన వ్యక్తి మీద మూత్రం పోస్తూ పైశాచికంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియోను ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ట్యాగ్ చేస్తూ.. సదరు వ్యక్తిపై, బిజెపిపై తీవ్ర స్థాయిలో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ ఆదివాసి వ్యక్తిని తన నివాసానికి పిలుపించుకుని అతని కాళ్లను కడిగి సన్మానించారు. ఆదివాసీపై మూత్ర విసర్జన చేసి పైశాచికంగా వ్యవహరించిన ప్రవేశ్ శుక్లాపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అతని ఇంటిని కూల్చివేశారు.
#WATCH | Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan meets Dashmat Rawat and washes his feet at CM House in Bhopal. In a viral video from Sidhi, accused Pravesh Shukla was seen urinating on Rawat.
CM tells him, "…I was pained to see that video. I apologise to you.… pic.twitter.com/5il2c3QATP
— ANI (@ANI) July 6, 2023
Also Read: గిరిజనుడిపై మూత్ర విసర్జన.. బిజెపి నేత అరెస్ట్