Monday, December 23, 2024

గిరిజన యువకుని కాళ్లు కడిగిన సిఎం శివరాజ్ సింగ్

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్య ప్రదేశ్ లోని సిధి ప్రాంతంలో ఓ గిరిజన యువకునిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన సంగతి తెలిసిందే. సిధి జిల్లాలో రోజువారీ కూలీగా బతుకుతున్న యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జనకు పాల్పడడం అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనకు బాధ్యుడైన నిందితుడు ప్రవేశ్ శుక్లాను పోలీస్‌లు బుధవారం అరెస్టు చేశారు.

బాధితుడు దశమత్ రావత్‌ను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చైహాన్ గురువారం భోపాల్ లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. బాధితుడిని కుర్చీలో కూర్చోబెట్టి అతని కాళ్లు కడిగారు. అతనికి బొట్టు పెట్టి పూల మాలలు వేసి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఆయనకు స్వీటు తినిపించి కెమెరాలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా సీఎం శివరాజ్ సింగ్ మాట్లాడుతూ మూత్ర విసర్జన వీడియో చూసి తన మనసుకు బాధనిపించిందని, ఇందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్టు తెలిపారు. ప్రజలు తనకు దేవుడితో సమానమని అతనితో తెలిపారు. ఈ తరహా దుశ్చర్యలను సహించేది లేదని, రాష్ట్రం లోని ప్రతి పౌరుడి గౌరవం తన గౌరవమేనని పేర్కొన్నారు. బాధితుడికి సిఎం కాళ్లు కడుగుతున్న వీడియా ఇప్పుడు వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News