Monday, December 23, 2024

సిఎం కెసిఆర్‌ను మరోమారు ఆశీర్వదించాలి

- Advertisement -
- Advertisement -
  • ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం
  • 260 మంది లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు పంపిణీ చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్

హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని పేద ప్రజల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సొంతింటి కల సహకారం అయిందని గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు కట్టించి మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌ను మరోమారు ఆశీర్వదించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్‌కుమార్ అన్నారు.

మంగళవారం పట్టణంలోని స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మున్సిపల్ పరిధిలోని ఇటీవలే లక్కీ డ్రా ద్వారా ఎన్నుకున్న 260 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందని తెలిపారు.

అర్హులైన లబ్ధిదారుల కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు పేదవారికి అండగా నిలుస్తూ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని అన్నారు. అదేవిధంగా సొంత స్థలం కలిగి ఉన్న ఇల్లు లేని ప్రతి కుటుంబానికి గృహలక్ష్మి పథకం వర్తింపజేసి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుందని గృహలక్ష్మి పథకాన్ని అర్హులందరూ వినియోగించుకొని ఇల్లు నిర్మించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సర్వతో అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా జడ్పీ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ బాబు, సిద్దిపేట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, ఎంపీపీ లకావత్ మానస సుభాష్, ఏఎంసి చైర్మన్ ఎడబోయిన రజని, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, ఆర్డిఓ బెన్ షాలోమ్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండి అన్వర్, నాయకులు వాల నవీన్ రావ్, బోజు రవీందర్, లక్ష్మణ్ నాయక్, రమేష్ నాయక్, గాందె చిరంజీవి, క్రాంతి కుమార్, పరశురాములు, పట్టణ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News