Monday, December 23, 2024

సీఎం కేసిఆర్ పర్యటనను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: ఈ నెల 30 న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటనను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ వీప్ బాల్క సుమన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ స్థలాన్ని నూతన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలను ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మితో కలిసి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసిఅర్ ఈ నెల 30 న జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టర్, జిల్లా పోలీసు కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం కేసిఅర్ హాజరవుతున్నారని, అలాగే అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ సభలోనే పోడు భూముల రైతులకు పట్టాలు పంపిణి కార్యక్రమం జిల్లా నుండే మొదలుపెడుతున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసిఅర్ జిల్లాలను ఏర్పాటు చేసి వాటి అభివృద్దికి అనేక నిధులను సమకుర్చి జిల్లాల అభివృద్దికి తోడ్పడు తున్నారని అన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో పోడు రైతులు చాలా మంది ఉన్నారని, వారిని దృష్టిలో పెట్టుకోని పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పోడు పట్టాలను అందజేస్తున్నారని అన్నారు. సభకు జిల్లాలోని ప్రజలు హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News