Friday, January 31, 2025

ఉచిత బస్సు రవాణా పథకం పునఃసమీక్షపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..

- Advertisement -
- Advertisement -

మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సు రవాణా పథకాన్ని పునఃసమీక్ష చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. కొందరు మహిళలు టికెట్‌ డబ్బులు చెల్లిస్తామని ట్వీట్లు, మెయిళ్లు పెడుతున్నారని ఇటీవల డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు. అవన్నీ ఊహాగానాలేనని, తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని ఆయన చెప్పారు. ఐదు గ్యారంటీల్లో భాగంగా గతేడాది నుంచి కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం శక్తి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News