Sunday, December 22, 2024

కాంగ్రెస్ రూ.700 కోట్లు సేకరణ రుజువు చేయగలరా ?: సిఎం సిద్ధ రామయ్య

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఉప ఎన్నికలకు ఖర్చుపెట్టడం కోసం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 700 కోట్లు వసూలు చేస్తోందని ప్రధాని నరేంద్రమోడీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆరోపించడాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తిప్పికొట్టారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని సిద్ధ రామయ్య స్పష్టం చేశారు. దీన్ని రుజువు చేయలేకుంటే మోడీ తప్పనిసరిగా తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. దేశానికి ప్రధాని అయి ఉండీ ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం తనకు ఆశ్చర్యం వేస్తోందని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ మాట్లాడుతూ మహారాష్ట్ర,

ఝార్ఖండ్ ఉప ఎన్నికల కోసం ఖర్చు చేయడానికి పంపేందుకు కర్ణాటకలో ఎక్సైజ్ విభాగం ద్వారా కాంగ్రెస్ రూ. 700 కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. కర్ణాటక లోని హవేరీ జిల్లా షిగ్గావోన్‌లో ఆదివారం రాత్రి ఎన్నికల ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మాట్లాడారు. “ ఈ ఆరోపణలు ప్రధాని మోడీ రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతాను, అలాగే మీరు (మోడీని ఉద్దేశించి) రుజువు చేయలేకుంటే రాజీయాల నుంచి రిటైర్ కావాలి ” అని సిద్ధ రామయ్య సవాలు విసిరారు. ప్రధాని అలాంటి ఆరోపణలు చేస్తే అవి వాస్తవాలకు దగ్గరలో ఉండాలి. కానీ ఈ ఆరోపణలన్నీ వాస్తవాలకు చాలా దూరం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ విధంగా అబద్ధాలు ఆడే ప్రధానిని చరిత్రలో ఎన్నడూ చూడలేదు అని ధ్వజమెత్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News