Thursday, November 21, 2024

కర్నాటక గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

కర్నాటక కాంగ్రెస్ యోచన
సిఎం ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన గవర్నర్

బెంగళూరు : మైసూరు పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌పై ఫిర్యాదు చేయడానికి అధికార కాంగ్రెస్ శాసనసభ్యుల ప్రతినిధివర్గం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకోగలదని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి జి పరమేశ్వర్ బుధవారం సూచించారు. ఈ విషయమై తాత్కాలిక వ్యూహం రూపొందించామని, కోర్టులో పరిణామాలను పరిశీలించిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. గవర్నర్ ఉత్తర్వును ముఖ్యమంత్రి హైకోర్టులో సవాల్ చేశారు. ఈ విషయమై విచారణను ఈ నెల 29 వరకు 19న వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు ప్రైవేట్ ఫిర్యాదుల పరిగణనను వాయిదా వేయవలసిందని విచారణ కోర్టును కోరింది.

‘గవర్నర్ ప్రవర్తనపై మేము చర్చలు జరిపి, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిరసనలు నిర్వహిస్తుందని, ఆ తరువాత శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఒకేసారి గవర్నర్‌కు వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నిస్తారని మా రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్ వెల్లడించారు’ అని పరమేశ్వర వివరించారు. పరమేశ్వర బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, కోర్టులో ‘పరిణామాలను, నిర్ణయాలను’ పరిగణనలోకి తీసుకున్న తరువాత రాష్ట్రపతిని శాసనసభ్యులు అంతా కలుసుకునే విషయమై తాత్కాలికంగా ఒక ప్లాన్ చర్చించామని చెప్పారు. ‘ఈ నెల 31న రాజ్ భవన్ చలో కార్యక్రమాన్ని తలపెట్టాం& గవర్నర్‌ను కలుసుకుని, ఆయనకు వినతిపత్రం సమర్పించే అవకాశాన్ని పరిశీలిస్తాం’ అని పరమేశ్వర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News