Wednesday, January 22, 2025

సిఎం సిద్ధరామయ్య మెడకు ముడా స్కామ్

- Advertisement -
- Advertisement -
  •  కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాలు
  •  సిఎం ప్రాసిక్యూషన్‌కు అనుమతిపై తుపాన్
  •  కొత్త మలుపు తిరిగిన మైసూరు భూముల వ్యవహారం

బెంగళూరు : కర్నాటకలో భూ సంబంధిత ముడా స్కామ్ పలు కీలకమలుపులు తిరిగింది. సిఎం సిద్ధరామయ్య సారధ్యపు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ తవార్ చంద్ గెహ్లోట్‌కు మధ్య చిచ్చు రగిలింది. ఈ వ్యవహారంలో తనపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి నివ్వడంపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్ నిర్ణ యం చట్టవిరుద్ధమని, ఇది పూర్తిగా రాజ్‌భవన్‌ను కేంద్రీకృతం చేసుకుని కేంద్రంలోని బిజెపి ప్రభు త్వం సాగిస్తున్న కపటనాటకం అని విమర్శించారు.

ఏదో ఒక సాకుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేయడం, కుప్పకూల్చడం మోడీ సర్కారు కుట్ర కోణాలలో భాగం అని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఇతర కీలక నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సిద్ధరామయ్య గవర్నర్‌పై విరుచుకుపడ్డారు. గవర్నర్ నిర్ణయాన్ని తాము కోర్టులో సవాలు చేస్తామని, ఏ స్థాయిలో కోర్టుకు వెళ్లాలి? అనేది నిపుణులతో చర్చించి ఖరారు చేసుకుంటామని వివరించారు. గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి అయి ఉండి కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా చర్యలకు దిగుతారా? అని నిలదీశారు.

ముడా అంటే మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ, ఈ అధికారిక సంస్థ నుంచి సిద్ధరామయ్య భార్య పార్వ తి, ఇతరులకు విలువైన భూములు కేటాయించారు. ఈ దశలో ముఖ్యమంత్రి నుంచి అనుమతి దక్కడం అధికార దుర్వినియోగం అయిందనే ఆ రోపణల నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడు ముడా స్కాం తీవ్రస్థాయి వ్యవహారం అయింది. రాష్ట్రం లో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల ద్వారా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇది ప్రజా ప్రభు త్వం, ఈ ప్రభుత్వాన్ని బిజెపి, జెడిఎస్ ఇతర పక్షాలు రాజకీయకక్షతో కూల్చాలని చూస్తే ఊరుకునేది లేదని ఈ దశలో సిద్ధూ తమ డిప్యూటి డికెతో కలిసి ప్రకటించారు. తనపై ఫిర్యాదు అందిన రోజే షోకాజ్ వెలువరించారని, ఈ విధంగా గవర్నర్ స్పందిస్తారని తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.

ఎదురుదాడికి దిగిన కర్నాటక బిజెపి
అక్రమానికి పాల్పడి, భూ లావాదేవీలతో ఏకంగా రూ 4000 కోట్ల వరకూ స్కామ్ చేసిన సిఎంపై గవర్నర్ చర్య సబబే అని బిజెపి ఎదురుదాడికి దిగింది. విలువైన భూముల విషయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవహరిస్తే, రాజ్యాంగ ప్రతినిధిగా గవర్నర్ చూస్తూ ఉండాలా? అంతా బాగుందని కితాబు ఇవ్వాలా? అని బిజెపి ప్రశ్నించింది.

ఇదీ ముడా భూ కుంభకోణం

ఇప్పుడు వివాద కేంద్రబిందువు అయిన ముడా ల్యాండ్ స్కామ్ కెసరు గ్రామంలో 3.16 ఎకరా ల భూమికి సంబంధించిన వ్యవహారం, ఇక్కడ సిద్ధరామయ్య భార్యత పార్వతికి 3.16 ఎకరా ల భూమి ఉంది. దీనిని ముడా లేఔట్ల కోసం స్వాధీనం చేసుకుంది. కాగా ఇందుకు బదులు గా 2022లో విజయనగరంలో 14 అత్యంత కీలకమైన ప్రీమియం స్థలాలను కట్టబెట్టారు. 50 : 50 స్కీం పరిధిలో పరిహారం ప్రాతిపదికన ఈ అప్పగింత జరిగింది. కాగా ఆమె సొంత స్థ లం బదులుగా ఆమెకు పరిహారంగా దక్కిన స్థలం విలువల్లో చాలా తేడా ఉందని, అత్యధిక విలువల ఆస్తిని సిఎం భార్యకు కట్టబెట్టారని విమర్శలు తలెత్తాయి. దీనిని ఆమెకు ఏ ప్రాతిపదికన ఇస్తారని ఆర్టీఐ ఉద్యమకర్తలు నిరసన తెలిపారు.

అయితే ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు. ఆమె స్థలాన్ని ప్రజా ఉపయోగానికి ముడా సేకరించింది. ఇది చట్టబద్ధం. ఇం దుకు బదులుగా ఓ పౌరురాలిగా ఆమె స్థలం లేదా పరిహారం పొందాలి.ఈ క్రమంలోనే ఆమె కు వేరే చోట భూమి కేటాయించారు. ఇందులో తప్పేమి ఉందని ప్రశ్నించారు. ఈ భూ వ్యవహారంపై దర్యాప్తు జరిపించేందుకు ప్రభుత్వం జులైలోనే ఏకసభ్య దర్యాప్తు సంఘాన్ని ఏర్పా టు చేసింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి పిఎన్ దేశాయ్ సారథ్యంలో ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు అయిం ది. తామే దర్యాప్తునకు ఆదేశించినప్పుడు, నిజా లు నిగ్గు తేలుస్తున్నందున ఇక తమపై దర్యాప్తునకు గవర్నర్ ఆదేశాలు అన్యాయమే కాదు వికృతమని సిఎం సిద్ధరామయ్య మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News