బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పెట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఇందులోభాగంగా సీసి టీవి ఫుటేజీలు పరిశీలించగా, ఒక యువకుడు బ్యాగ్ తో సహా లోపలకి వెళ్లి, తిరిగి ఖాళీ చేతులతో బయటకు వెళ్లడం కనిపించింది. హోటల్లో టిఫిన్ తిని, బ్యాగ్ ను హ్యాండ్ వాష్ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయాడు. అందులో టిఫిన్ బాక్స్ పెట్టుకునే చిన్న బ్యాగ్ ఒకటి ఉంది. ఈ టిఫిన్ బాక్సులోనే బాంబు పెట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అదే యువకుడిని పేలుడుకి కొన్ని గంటల ముందు బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో గుర్తించారు. తలపై టోపీ పెట్టుకుని, కళ్లద్దాలు ధరించి, మాస్క్ పెట్టుకోవడంతో అతని మొహం స్పష్టంగా కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలిన దుర్ఘటనలో తొమ్మిదిమంది గాయపడ్డారు. కాలిన గాయాలైన ఒక మహిళకు డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. గాయపడినవారిని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పరామర్శించారు.
#WATCH | Bengaluru: Karnataka CM Siddaramaiah says "Government will bear all the treatment charges of all the patients. Around 10 people are injured. Three are here in the Brookfield Hospital and six others are admitted in Vydehi Hospital. I am also going there. The patients are… pic.twitter.com/nKdlVtzNZA
— ANI (@ANI) March 2, 2024