Monday, December 23, 2024

మూడో ‘సారే’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కె చంద్రశేఖర్ రావు, ఆయన సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) వరుసగా మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం అధికంగా ఉందని న్యూఢిల్లీలో జరిగిన రౌండ్ టేండ్ సమావేశంలో పాల్గొన్న మేధావులు, రాజకీయ పరిశీలకులు, సీనియర్ జర్నలిస్టులు అంచనా వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఇన్ ది సౌత్ ఆఫ్ వింధ్యాస్ పేరిట రౌండ్ టేండ్ చర్చల పరంపరలో ఐదవ భాగాన్ని న్యూఢిల్లీకి చెందినది ఇన్‌స్టిట్యూట్ ఫర్ గవర్నెన్స్, పాలసీస్ అండ్ పాలిటిక్స్ నంబర్ 3న న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.

ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు పుంజుకున్నప్పటికీ గత ఎన్నికల్లో కనిపించిన ఓట్ల వాటాలో ఉన్న 18 శాతం లోటును పూడ్చడం ఆ పార్టీకి అసాధ్యమని వక్తలు పేర్కొన్నారు. ఇం దుకు ప్రధాన కారణం కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత సమస్య లు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ప్రజలలో ఉన్న ఆదరణగా వారు అభిప్రాయపడ్డారు. కొన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం గత రెండు పర్యాయాలలో అ మలు చేసిన సంక్షేమ పథకాల పట్ల అత్యధిక ప్రజలు సం తృప్తి చెందుతున్నారని వారు వ్యాఖ్యానించారు. కాగా, ఈ లోటుపాట్లను, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలం గా మలచుకోవడంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పా ర్టీ విఫలమైందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ సంజయ్ కుమార్ (సిఎస్‌డిఎస్, న్యూఢిల్లీ), వర్గీస్ కె జార్జి (రెసిడెంట్ ఎడిటర్, న్యూ ఢిల్లీ, ది హిందూ), డాక్టర్ అజయ్ గుధవర్తి (అసోసియేట్ ప్రొఫెసర్, జనవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూ ఢిల్లీ), పర్సా వెంకటేశ్వరరావు (జూనియర్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు), డాక్టర్ సజ్జన్ కుమార్ (ఫెలో, ప్రైమ్ మినిస్టర్స్ మ్యూ జియం అండ్ లైబ్రరీ, న్యూఢిల్లీ), ప్రదీప్ గుప్తా (చైర్మన్ అం డ్ ఎండి, యాక్సిస్ మై ఇండియా), యశ్వంత్ దేశ్‌ముఖ్ (డైరెక్టర్, సి-ఓటర్), రవి రెడ్డి, (రెసిడెంట్ ఎడిటర్,తెలంగాణ, ది హిందూ) పాల్గొన్నారు. డాక్టర్ మనీష్ తివారీ (డైరెక్టర్, ఐజిపిపి,మోడరేటర్)గా వ్యవహరించారు.

ప్రస్తుత తెలంగాణ రాజకీయాల గురించి ప్రొ.సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం పుంజుకున్నప్పటికీ బిఆర్‌ఎస్‌కు మాత్రమే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బిఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నం త మాత్రాన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భార త రాజకీయాలలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారని, తెలంగాణలో కూడా అది పునరావృతం అయినా ఆశ్చర్యపోనవసరం లేద ని ఆయన అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటు వాటా 46 శాతం ఉండగా కాంగ్రెస్ ఓటు వాటా 28% మాత్రమేనని, ఐదేళ్లలో 18% ఓటు వాటా లోటు భర్తీ చేయడం చాలా కష్టమని, బిఆర్‌ఎస్‌కు కచ్ఛితంగా ఎన్ని సీట్లు దక్కుతాయో చెప్పలేనప్పటికీ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. బిఆర్‌ఎస్ ఓటు శాతం 10% తగ్గే అవకాశం ఉందని, అయితే ఈ ఓట్లు బిజెపి, కాంగ్రెస్ మధ్య ఎలా చీలిపోతాయన్నది ఆసక్తికరమైన అంశమని యాక్సిస్ మై ఇండియా చైర్మన్ అండ్ ఎండి ప్రదీప్ గుప్తా అన్నారు. తెలంగాణ రాష్ట్రం తన ఉనికికి సంబంధించిన సమస్యల నుంచి పాలన, సంక్షేమానికి సంబంధించిన సమస్యలవైపు సాగుతోందని యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమర్థత వారికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. తమకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సంపూర్ణంగా వినియోగించుకుని 2018 తరహాలోనే బిఆర్‌ఎస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకే పరిమితమని, అయితే ఫలితాలపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలని రవి రెడ్డి అభిప్రాయపడ్డారు.

కెసిఆర్‌కు ఆయన కుమారుడు కెటిఆర్ కన్నా ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయని పర్సా వెంకటేశ్వరరావు జూనియర్ అన్నారు. బిజెపికి ఉన్న ఏకైక సమస్య ఆ పార్టీకి ఓబిసిల నుంచి మాత్రమే మద్దతు ఉండడమని, ఆ పార్టీకి ఉన్న పాన్ ఇండియా అజెండా ప్రాంతీయంగా పనిచేయబోదని ఆయన వ్యాఖ్యానించారు. అఎంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి మూడవ స్థానంలోకి పడిపోయిందని, ప్రజలు గెలిచే అవకాశం ఉన్న పార్టీలకే తమ ఓటును వేయడానికి మొగ్గు చూపుతారన్న ఏకాభిప్రాయం రౌండ్ టేండ్ చర్చలలో వక్తల నుంచి వ్యక్తమైంది.ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో విదేశీ ప్రతినిధులు, రాయబారులు, రాజకీయ విశ్లేషకులు, రిసెర్చ్ స్కాలర్లు, జర్నలిస్టులు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News