Monday, January 20, 2025

పారిశ్రామిక వేత్తలుగా అడవి బిడ్డలు

- Advertisement -
- Advertisement -

వెన్నంటి ప్రోత్సహిస్తున్నగిరిజన మంత్రిత్వ శాఖ
సిఎమ్‌ఎస్‌టిఇఐ పథకం కింద చేయూత
కార్యరూపంలో వినూత్న ఆలోచనలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రం లో అనాదరణకు గురైన గిరిజన, ఆదివాసి, అడవి బిడ్డలకు మేమున్నామంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గ్రామాలకు దూరంగా అడవుల్లో, కొండ కోనల్లో నివసించే ఆదివాసి, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిం పేందకు గిరిజన మంత్రిత్వ శాఖఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. వారికి విద్యను అందించడంతో పాటు విద్యావంతులైన నిరుద్యోగ గిరిజన ఆదివాసీ యువతను పారిశ్రామిక వేత్తలు గా, వ్యాపార వేత్తలుగా ఎదిగేందుకు సహకారాన్నందిస్తోంది. వారి వినూత్న ఆలోచనలు ఆచరణలో పెట్టేందుకు ప్రోత్సహిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అండదండలు అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

రాష్ట్ర వ్యాప్తంగా ఔత్సాహిక గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మెరిట్ ప్రాతిపదికగా ఎం పిక చేసి వారికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బి)లో శిక్షణ నిస్తోంది. ఒక్కో యూనిట్‌కు రూ. 50 లక్షలు రాయతీ కల్పిస్తోంది. గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందు కు ఐఎస్‌బి, ఎస్‌బిఐతో కలిసి గిరిజన ఆర్థిక స హకార సంస్థ (ట్రైకార్) సిఎం గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక ఇన్నోవేషన్ (సిఎంఎస్‌టిఈ ఐ) పథకాన్ని 2018 నుండి అమలు చేస్తోంది. ఈ పథకం కింద దాదాపు 172 మంది వ్యాపారాలు ప్రారంభించి ఆదాయం పొందడంతో పా టు వేలాది మందికి ఉపాధి కల్పించారు. వంద ల కోట్ల టర్నోవర్‌ను సాధిస్తున్నారు. ఈ సం స్థల్లో 50 శాతం ఉద్యోగాలను గిరిజనులకు కే టాయించడం జరిగింది.

ఈ సథకం కింద దరఖాస్తు చేసుకోడానికి గిరిజన యువతీ యువకులు కనీస విద్యార్హత డిగ్రీ కలిగి ఉండాలి. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా రెండేళ్ళ అనుభవం ఉన్న వారికి, సాంకేతిక నిపుణులకు ప్రాదాన్యం లభిస్తుంది. కొత్త స్టార్టప్‌ల ను ప్రోత్సహించడంతో పాటు అర్హులైన ఆదివా సి గిరిజనులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తుదారుల నుండి ఐఎస్‌బి పరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలలు శిక్షణ నిస్తారు.

అనంతరం పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)లు సిద్దం చేస్తారు. వీటిని రాష్ట్రస్థాయి క మిటీ పరిశీలించి అర్హులైన అబ్దిదారుల ఎంపిక చేయడం జరుగుతుంది. అవసరమైన పెట్టుబడి ని బ్యాంకుల ద్వారా గిరిజన సంక్షేమ శాఖ అం దిస్తుంది. బ్యాంకులు ఇచ్చిన రుణాన్ని ఏడేళ్ళ లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో బ్యాంకు రుణం 55 శాతం, రాయితీ 35 శాతం, లబ్దిదారుల వాటా 10 శాతం ఉంటుంది. గరిష్ఠ సబ్సిడీ 50 లక్షల వరకు ఇస్తారు.

ఏటా 100 మందికి శిక్షణ..
ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఏటా 100 మందికి శిక్షణ నివ్వాలని గిరిజన సంక్షేమ శా ఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐఎస్‌బి లో ఇప్పటి వరకు 300 మందికి శిక్షణ నిచ్చా రు. 2018 నుండి 2020 వరకు 100 మంది చొప్పున శిక్షణ నివ్వగా 2022 లో 200 మం దిని శిక్షణ కోసం ఎంపిక చేశారు. 2020 వరకు శిక్షణ పొందిన 300 మందిలో 172 మంది డిపిఆర్‌లు సమర్పించారు. 95 మంది డిపిఆర్‌లకు ఆమోదం లభించింది.

వీటిలో ఫుడ్ అండ్ బేవరేజెస్, నిర్మాణ రంగం, ఆరోగ్య, తయారీ, పశుసంవర్థక, మీడియా, రిటైల్, రవాణా, ఆహార శు ద్ది రంగాల ప్రాజెక్టులు ఉన్నాయి. హార్లీస్, అర్బ న్ మాంక్, బిగ్‌బీన్, ప్రెస్కా పేరిట పలు బ్రాండ్లు ఆవిర్భవించాయి. ఇప్పటి వరకు మంజూరైన 95 ప్రాజెక్టులకు 108 కోట్ల వ్యయం కాగా బ్యాంకులు రూ.58.95 కోట్లను రుణంగా ఇచ్చా యి. సబ్సిడీ కింద రూ. 38.22 కోట్లు మంజూ రు కాగా లబ్దిదారుని వాటా రూ. 10.82 కో ట్లు. 128 మంది గిరిజన లబ్దిదారులు డిపిఆర్ లు సమర్పించలేదు. 202223 ఏడాదికి 200 మందికి శిక్షణ నిస్తున్నారు.

స్కిన్/హెయిర్ క్లినిక్ ప్రారంభించా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సి ప్రాంతానికి చెందిన లంబాడి తెగ మాది. ఎంబిబిఎస్ గ్రాడ్యుయేషన్ చదివా. వ్యాపార వేత్తగా ఎంపికయ్యాను. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో స్కిన్ / హెయిర్ క్లినిక్ స్థాపించాను. ప్రాజెక్టు వ్యయం రూ.1.48 కోట్లు, అందులో రూ.50 లక్షలు ట్రైకార్ సబ్సిడీ కాగా రూ.83 లక్షలు బ్యాంకు రుణం, రూ. 15 లక్షలు లబ్దిదారుల సహకారంతో పాటు రూ.15.39 లక్షలు గ్యారెంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ కింద కోవిడ్ ఉపశమనం, 2019లో యూనిట్ స్థాపించా. ప్రస్తుతం నెలకు టర్నోవర్ సగటున రూ.10 లక్షలు. నెలవారి నికర ఆదాయం రూ. లక్ష 8 మంది మందికి ఉపాధి కల్పించాను.   -డాక్టర్ వేణు కుమారి బానోతు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News