Sunday, December 22, 2024

ఒరిజినల్ స్టాలిన్‌లా వ్యవహరిస్తున్న సిఎం స్టాలిన్: కేంద్ర మంత్రి

- Advertisement -
- Advertisement -

పణాజీ: ప్రజల హక్కులు, ప్రజల స్వేచ్ఛ పట్టని రష్యన్ నియంత జోసెఫ్ స్టాలిన్‌లా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వ్యవహరిస్తున్నారని కేంద్ర టెక్నాలజీ, ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు.

సోషల్ మీడియా పోస్టుపై సిపిఎం నాయకుడు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని తమిళనాడు బిజెపి కార్యదర్శి ఎస్‌జి సూర్యను పోలీసులు అరెస్టు చేయడంపై చంద్రశేఖర్ శనివారం నాడిక్కడ స్పందించారు. తన నియోజకవర్గంలో పారిశుధ్య కార్మికుడి మృతిపై ఎస్‌జి సూర్య కేవలం ట్వీట్ చేశారని దక్షిణ గోవాలోని మర్గావ్ పట్టణంలో బిజెపి సాంస్థాగత కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

ఐటి చట్టంలోని సెక్షన్ 66ఎ కింద ఒకప్పటి యుపిఎ ప్రభుత్వ కాలంలో కాంట్రెస్ పార్టీ ట్వీట్లు చేసిన వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపేదని, ఇప్పుడు దాని మిత్రపక్షం డిఎంకె ఆ పని చేస్తోందని ఆయన ఆరోపించారు. ఐటి చట్టం సెక్షన్ 66ఎను సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఆయన గుర్తు చేశారు. ఒరిజినల్ స్టాలిన్‌తో తనను తాను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పోల్చుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News