Saturday, March 1, 2025

72వ ఏట ప్రవేశించిన టిఎన్ సిఎం స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ శనివారం 72వ ఏట అడుగుపెట్టారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తికి, ద్విభాషా విధానానికి, హిందీ భాష విధింపును వ్యతిరేకించడానికి కట్టుబడి ఉండడమే తన జన్మదిన సందేశం అని స్టాలిన్ ఉద్ఘాటించారు. తన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసిన స్టాలిన్ తమిళనాలు ప్రయోజనాల పరిరక్షణ, హిందీ విధింపునకు వ్యతిరేకత అనే ‘ఏకైక లక్షం’ కోసం పార్టీ శ్రేణులతో ప్రమాణం చేయించారు. ‘తమిళనాడు పోరాడుమ్, తమిళనాడు వెళ్లుమ్’ (తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది) అని స్టాలిన్ నినదించగా పార్టీ కార్యకర్తలు దానిని తిరిగి వినిపించారు. చెన్నైలోనిడిఎంకె ప్రధాన కార్యాలయం ‘అణ్ణా అరివాలయం’లో ఉత్సవ శోభ కానవచ్చింది. తమ పార్టీ అధినేతకు శుభాకాంక్షలు తెలియజేయడానికి పార్టీ శ్రేణులు, ఆఫీస్ బేరర్లు అధిక సంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చారు.
ప్రధాని మోడీ శుభాకాంక్షలు
ఇది ఇలా ఉండగా, స్టాలిన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘకాలం ఆరోగ్యంతోజీవనం సాగించుగాక’ అని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. తమిళనాడు గవర్నర్ రవి తన సందేశానికి తమిళంలో సంతకం చేయడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News