Saturday, January 11, 2025

రాష్ట్ర అభివృద్ధిని గవర్నర్ జీర్ణించుకోలేక పోతున్నారు : సిఎం స్టాలిన్

- Advertisement -
- Advertisement -

డీఎంకె నేతృత్వం లోని తమిళనాడు ప్రభుత్వం , గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య కొంతకాలంగా బేధాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమం లోనే మరోసారి గవర్నర్‌పై ముఖ్యమంత్రి ఎమ్‌కె స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఆయన జీర్ణించుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ గవర్నర్ అసెంబ్లీకి వచ్చినా ప్రసంగించకుండానే మధ్యలో వెళ్లిపోయారు. ఆయన తీరు చిన్నపిల్లల చేష్టల మాదిరిగా ఉంది.

రాజ్యాంగం ప్రకారం గవర్నర్ బాధ్యతను నిర్వర్తించలేకపోయారు. తమిళనాడు అభివృద్ధి చూసి ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు ” అని సీఎం తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా, ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించలేదని ఆరోపిస్తూ గవర్నర్ ఆర్‌ఎన్ రవి , ప్రసంగం చేయకుండానే వెళ్లిపోయారు. “ రాజ్యాంగం, జాతీయ గీతానికి మరోసారి అవమానం జరిగింది. జాతీయ గీతాన్ని గౌరవించడం రాజ్యాంగం ప్రకారం మన ప్రాథమిక విధి. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయి. ” అంటూ ఇటీవల ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ పరిణామంతో అధికార డీఎంకె ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య మరోసారి విభేదాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రజలను , ప్రభుత్వాన్ని ఆయన ఎప్పుడూ అవమానిస్తున్నారని ఆరోపించిన స్టాలిన్, గవర్నర్ చర్యపై మరోసారి విమర్శలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News