Monday, December 23, 2024

తమిళనాడులో పిల్లలకు టిఫిన్ల స్కీం

- Advertisement -
- Advertisement -

CM Stalin Rolls Out Free Breakfast Scheme

మధురైలో ఆరంభించిన సిఎం స్టాలిన్

మధురై : తమిళనాడులో ప్రభుత్వ ప్రాధమిక స్కూళ్ల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని సిఎం ఎంకె స్టాలిన్ గురువారం ప్రారంభించారు. ఈ పథకం పరిధిలో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు టిఫిన్లు అందుతాయి. మధురైలో పథకం ఆరంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్ అక్కడి చిన్నారులకు ఆహారం అందించడమే కాకుండా వారితో కలిసి కూర్చుని తాను కూడా ఆరగించారు. పేదల జీవనస్థితిగతులలో మార్పు దిశలో ఈ పథకం దోహదం చేస్తుంది. పిల్లల్లో అధ్యయన శక్తి పెరిగేందుకు, పిల్లలను క్రమం తప్పకుండా బడులకు రప్పించేందుకు ఈ స్కీం దోహదపడుతుందని , చరిత్రలో దీనికి ప్రత్యేకత ఉంటుందని తెలిపారు. పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ స్కీంలు అమెరికా, యూరప్‌లలో ఉన్నాయని , అక్కడ విద్యార్థులలో వికాసానికి ఈ తోడ్పాటు ఎంతగానో ఉపకరించినట్లు వెల్లడైందని, దీనిని పరిగణనలోకి తీసుకున్నామని స్టాలిన్ తెలిపారు. స్కీం తొలిదశలో రాష్ట్రంలోని 1545 స్కూళ్లలో అమలు అవుతుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి నేపథ్యంలో మధురైలో దీనిని ఆరంభించారు. ఈ అల్పాహార పథకంలో భాగంగా విద్యార్థులకు వడ్డించే వాటిలో సాంబార్‌తో సేమియా ఉప్మా, రవ్వ ఉప్మా, సేమియా కిచిడి, రవ్వ పొంగళి ఉంటాయి. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News