Monday, December 23, 2024

రెండో విడత న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ రెండో విడత న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రారంభించారు. నిమ్స్ లో రెండో విడత న్యూట్రిషన్ కిట్ పథకాన్ని బుధవారం ప్రారంభించారు. ఆరుగురు గర్భిణీలకు న్యూట్రీషన్ కిట్స్ అందించారు సిఎం కెసిఆర్. ఇప్పటికే 9 జిల్లాల్లో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలులో ఉంది. మిగిలిన 24 జిల్లాల్లో రేపట్నుంచి న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 6.8 లక్షల మంది గర్భిణీలకు ప్రయోజనం కలగనుంది. న్యూట్రిషన్ కిట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 250 కోట్ల కేటాయించింది.

నగరంలోని పంజాగుట్ట నిమ్స్ లో కొత్త బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సిఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యే దానం నాగేందర్, నిమ్స్ డైరెక్టర్ పాల్గొన్నారు. రూ. 1571 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంతో దశాబ్ది బ్లాక్ పేరుతో నిమ్స్ లో 2వేల పడకలతో కొత్త బ్లాక్ ను ప్రభుత్వం నిర్మిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News