Sunday, April 20, 2025

కితాక్యూషూ నగరంలో సిఎం బృందం పర్యటన

- Advertisement -
- Advertisement -

జపాన్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే సిఎం పర్యటనలో 11వేల కోట్ల పెట్టుబడులు, ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో భాగంగా సిఎం బృందం కితాక్యూషూ నగరంలో పర్యటించారు. వీరికి అక్కడ సాంప్రదాయ నృత్యరీతిలో స్వాగతం పలికారు.

నగర మేయర్ కజుహిసా టకేచీతో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. సుస్థిరత, రీసైక్లింగ్, ఆవిష్కరణ, పర్యావరణ సంరక్షణకి కితాక్యూషూ నగరం ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు జపాన్‌లోనే అత్యంత కాలుష్య నగరంగా ఉండే కితాక్యూషూ.. ఇప్పుడు ప్రపంచంలోనే పర్యావరణ రక్షణలో ఈ నగరం ఉదాహరణగా నిలిచింది. ఈ నగరం నుంచి పర్యావరణాన్ని తీర్చిదిద్ధిన తీరును సిఎం బృందం పరిశీలించింది. ఈ నెల 22 వరకూ సిఎం బృందం జపాన్ పర్యటన కొనసాగనుంది.

Video Credits : Congress4ts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News