- Advertisement -
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చాలా రోజుల తరువాత బుధవారం ఇక్కడి సచివాలయం (మంత్రాలయ)ను సందర్శించారు. గత ఏడాది నవంబర్‌లో ఆయనకు రెండు భారీ ఆపరేషన్లు జరిగాయి. తరువాత విశ్రాంతి తీసుకుని ఇప్పుడు ఆయన సచివాయలంలోని తమ కార్యాలయానికి రావడం ఇదే తొలిసారి అయింది. సాంకేతికతను మరింతగా వాడుకుని అధికార యంత్రాంగం అన్ని ఫైళ్లను కంప్యూటరీకరించి పారదర్శకతకు, పేపర్హ్రిత వ్యవస్థకు దారి కల్పించాలని థాకరే పిలుపు నిచ్చారు. సిఎం మంత్రాలయం రావడం పట్ల ఎన్‌సిపి నేత శరద్ పవార్ హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -