తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసును హైకోర్టు పర్యవేక్షణలో సిబిఐ చేత విచారణ జరిపించాలన్న ప్రతిపక్ష కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్ డిమాండ్‌ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం తిరస్కరించారు. ఈ కేసులో తనపైన, తన కుటుంబ సభ్యులపైన, కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులపైన ప్రధాన నిందితుడు చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి ఖండించారు. ఈ కేసు దర్యాప్తును నీరుగార్చడానికి సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ కారణంగా కేసును బెంగళూరుకు బదిలీ చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన ఆరోపణలను కూడా ముఖ్యమంత్రి విజయన్ అసెంబ్లీలో తిరస్కరించారు. ముఖ్యమంత్రి సమాధానంతో ఆగ్రహించిన ప్రతిపక్ష సభ్యులు సభ మధ్యలోకి దూసుకెళ్లి విజయన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిబిఐ దర్యాప్తంటే భయపడుతున్నారా అంటూ ముఖ్యమంత్రిని వారు ప్రశ్నించారు. సభ అదుపు తప్పడంతో స్పీకర్ ఎంబి రాజేష్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.
CM Vijayan refuses CBI Probe Gold Smuggling