Thursday, January 23, 2025

డబ్బులు వసూలు చేసే ఎంఎల్‌ఎలకు సిఎం హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో దళితబంధు పథకం అమలు అంశంపై ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ సొంత పార్టీ ఎంఎల్‌ఎలను హెచ్చరించారు. పార్టీ ఆవిర్భావోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రతినిధుల సర్వసభ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలనుద్దేశించి ప్రసంగించిన ఆయన పార్టీకి చెందిన పలువురు ఎంఎల్‌ఎల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎంఎల్‌ఎల చిట్టా తన దగ్గర ఉందని, డబ్బులు వసూలు చేసే ఎంఎల్‌ఎలకు ఇదే చివరి హెచ్చరిక అని చెప్పిన ముఖ్యమంత్రి ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తప్పిస్తామని గట్టిగా హెచ్చరించారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎంఎల్‌ఎలదే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

రెండు పడకల గదుల ఇళ్ల విషయంలోనూ ఆరోపణలున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిలకు ఈ సందర్భంగా సునిశిత హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా పార్టీ కోసం కలిసి పని చేయాలని సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని మిగతా నియోజకవర్గాల్లోనూ ఇలాంటి సమస్యే ఉంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని చెప్పారు. నాయకులందరూ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఎలాంటి సమస్య ఉన్నా అధిష్టానంతో విన్నవించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలని చెప్పారు. కొన్నిగ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయని ఇళ్ల నిర్మాణానికి యోగ్యంగా ఉంటే వెంటనే పంచేద్దామని ముఖ్యమంత్రి తెలిపారు.

Also Read: విశ్వనగరమా.. విషాద నగరమా.. : చింతల

పార్టీ ఎంఎల్‌ఎలు లేని చోట జెడ్‌పి ఛైర్‌పర్సన్లు, ఎంపిలు, జిల్లా ఇంఛార్జిలను ఉపయోగించుకుని మూడ్నాలుగు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు 12 గంటల 45నిమిషాల వరకు అక్కడికి చేరుకోవాలని ఒంటి గంటా 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల వరకు మంత్రులు తమ ఛాంబర్స్‌కు వెళ్లిపోవాలని సూచించారు. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో బ్రీఫ్ మీటింగ్, లంచ్ తర్వాత డిస్పోస్ ఉంటుందని వెల్లడించారు. మెయిన్ గేట్ సిఎం, మంత్రులు, ఎంపి, ఎంఎల్‌ఎలకు ఉద్దేశించిందని 3 గేట్లు, నార్త్ ఈస్ట్ గేట్ అధికారుల రాకపోకల కోసమని, జనరల్ విజిటర్స్‌కు సౌత్ ఈస్ట్ కేటాయించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News