Thursday, January 23, 2025

స్వరాష్ట్రం కోసం ప్రాణాలకు సైతం తెగించిన సిఎం

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: సీఎం కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి ఉద్య మించిన కారణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ము ఠా గోపాల్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బిఆర్‌ఎస్ కవాడిగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి దోమలగూడ అరవింద్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు ఆ పార్టీ జెండా ను ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహలు శనివారం ఆవిష్క రించారు.

అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టిడిపి, బిజేపి పా ర్టీల న్నీ.. ద్వంద్వ వైఖరిని అవలంభించాయని అన్నారు. కేసీ ఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల ఆక్షాంక్షలకు అనుగుణంగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసినట్టు తెలియజేశారు. ఉద్య మంలో అన్ని వర్గాల ప్రజలు మమేకమై ప్రజా చైతన్యం ప్రదర్శించడం, సీఎం కేసీఆర్ ఆనాడు ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్షకు పూనుకో వడం వల్లనే తెలంగాణ ప్రకటన వచ్చిం దన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే విద్యుత్, తదితర అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారని ఆనాటి సీమాంధ్ర నాయకులు చెప్పారన్నారు.

కానీ, ప్రస్తుతం అదే విద్యుత్ సమస్యతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందులకు గురికా వడాన్ని మనం చూస్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముఠా జైసింహ లను సాయికృష్ణ గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ కవాడిగూడ డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, హనుమాన్ టెంపుల్ కమిటీ చైర్మన్ గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్, నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, రాజేష్, మాధవి, లడ్డు, జమాలుద్దీన్, రవి, దుర్గస్వామి, హరి, సంధ్యారాణి, వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News