Friday, December 20, 2024

సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేని ఎంతో మంది నిరుపేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ పథకం ఒక వరంలా మారిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తించని అనేక రోగాలకు సిఎం రిలీఫ్ ఫండ్, ఎల్‌ఓసీ ద్వారా వైద్యం చేయించుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న పేదవారు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోడానికి అర్హులన్నారు.

అందులో భాగంగా మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన సపావట్ వాలికి రూ. 1.50 అదేవిధంగా బజ్జుతండా గ్రామానికి చెందిన తేజావత్ రాజన్నకు రూ. 2 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవిందాపూర్ ఎంపీటీసీ దేవానాయక్, బజ్జుతండా సర్పంచ్ తిరుపతి, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News