Saturday, December 21, 2024

19, 20 తేదీల్లో సిఎం జిల్లాల పర్యటన

- Advertisement -
- Advertisement -

మెదక్, సూర్యాపేట జిల్లాల్లో బహిరంగ సభలు

మనతెలంగాణ/హైదరాబాద్: మెదక్, సూర్యాపేట జిల్లాల్లో ని ర్మించిన నూతన కలెక్టరేట్లను, జిల్లా పోలీస్ కార్యాలయాల ను ఈ నెల 19, 20వ తేదీల్లో సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. ఈ నె ల 19న (శనివారం) మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పో లీస్ (ఎస్‌పి) కార్యాలయాన్ని సిఎం ప్రారంభిస్తారు. అదేరోజు మెదక్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగించనున్నారు.

20న (ఆదివారం) కెసిఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నిర్మాణం పూర్తిచేసుకున్న సూర్యా పేట జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ (ఎస్‌పి) కార్యాల యం, నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రారం భించను న్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయా న్ని పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News