Monday, January 20, 2025

రాముడు శివుడు ఇక కృష్ణుడే మా నినాదం:యోగి ఆదిత్యానాథ్

- Advertisement -
- Advertisement -

లక్నో : మథురలో కృష్ణ జన్మభూమి వివాదం తరువాతి ప్రాధాన్యక్రమ అంశం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో యోగి బుధవారం అత్యంత భావోద్వేగ రీతిలో కవిత్వాత్మక ప్రసంగం సాగించారు. ఈ సందర్భంగా ముందుగా అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట అత్యంత ఉజ్వల ఘట్టం అని కొనియాడారు. దీనిని తామే కాదు అంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. రాముడు వైభవోపేతంగా నిలిచాడు, ఇక బిజెపి ముందున్న రెండో కీలక అంశం మథురలో కృష్ణ జన్మభూమి అని తెలిపారు.

రామ్‌లల్లా మెరిసి నిలిచాడు, ఇక కృష్ణ కన్హయ్య కూడా కట్లుతెంచుకుంటాడని వ్యాఖ్యానించారు. అయోధ్యలో ఉత్సవాలను చూసి అక్కడి జ్ఞానవాపి మసీదు సంబంధిత ప్రాంతంలోని నంది తన ఇన్నేళ్ల కట్టు తెంచుకుని పరుగులు తీసింది. అర్థరాత్రి వేళ తన బాబా పూజాదికాలు చూసిందని వారణాసిలో జ్ఞానవాపిలో ఇటీవల జరిగిన పూజాదికాలను ప్రస్తావించారు. ఇక కృష్ణ జన్మభూమి వివాదం కూడా కొలిక్కి వస్తుందని , రాముడు శివుడు తరువాత ఇక కృష్ణుడు తమ అజెండాలో జెండాగా నిలుస్తారని ఆదిత్యానాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News