Monday, December 23, 2024

ప్రధాని మోడీ గ్యారంటీపై దేశానికి నమ్మకం ఉంది: సిఎం ఆదిత్యనాథ్

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీపై వేలెత్తి చూపేవారు భారత్ అభివృద్ధికి ‘అవరోధకులు’ అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ సోమవారం ఆరోపించారు. హత్రాస్‌లో మేధావుల సమావేశంలో ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ, ‘విక్సిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్), సర్వతోముఖాభివృద్ధి మోడీ గ్యారంటీ. అభివృద్ధి చెందిన భారత్‌లో ఎటువంటి వివక్షా లేకుండా ముందుకు సాగడానికి ప్రతి వ్యక్తి, కులం, వర్గం గౌరవం, అవకాశం పొందాలి. కులతత్వం. ఆనువంశికత్వం ఉండరాదు. అందరికీ అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి చెందిన భారత్ సూత్రానికి ఇదే ఆధారం’ అని చెప్పారు. మొత్తం దేశానికి ప్రధాని మోడీ గ్యారంటీపై నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ‘మోడీ గ్యారంటీ అట్టడుగు స్థాయికి చేరడం మనం చూశాం. అందువల్ల మోడీ గ్యారంటీపై దేశం అంతటికీ నమ్మకం ఉంది. మోడీని వేలెత్తి చూపేవారు భారత్ అభివృద్ధికి అవరోధకులు.

అభివృద్ధి చెందిన భారత్ పథంలో ఇవి అడ్డంకులు’ అని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ‘మనం ఈ అడ్డంకులను తొలగించి, మోడీజీ నాయకత్వంలో సురక్షిత, సౌభాగ్య భారత్ కల సాఫల్యానికి పాటుపడవలసి ఉంటుంది’ అని ఆదిత్యనాథ్ సూచించారు. ఈ ఎన్నికలు కుటుంబం మొదట, దేశం మొదట మధ్య పోటీ అని ఆయన పేర్కొన్నారు. ‘బుజ్జగింపులా లేక భారత్ నమ్మకమా అనేది ఎంచుకోవాలి. అరాచకం, అల్లర్లు, కర్ఫూ విధించినవారు అధికారంలోకి వస్తారా లేక మోడీ ప్రభుత్వం వస్తుందా అనేది మనం చూడవలసి ఉంటుంది. మోడీ ప్రభుత్వం అల్లర్లు రహిత, కర్ఫూ రహిత, సురక్షిత వాతావరణాన్ని కల్పిస్తుంది. వివక్ష లేకుండా పాలన పథకాల ప్రయోజనాలను అది అందించింది. కులం, ప్రాంతం, భాష అంతరాలు చూడలేదు. అభివృద్ధి పథకాల ప్రయోజనాలను సమానంగా ప్రతి ఒక్కరికీ సమకూర్చడమైంది’ అని ఆదిత్యనాథ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News