Friday, December 20, 2024

ఔరంగజేబు ఆత్మ కాంగ్రెస్‌లో చొరబడింది: యోగి ఆదిత్యనాథ్

- Advertisement -
- Advertisement -

వారసత్వ పన్నును ప్రవేశపెట్టాలన్న కాంగ్రెస్ ఆలోచనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం విమర్శలు గుప్పించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆత్మ కాంగ్రెస్ పార్టీలో చొరబడినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నాసిక్ జిల్లాలోని మాలెగావ్ పట్టణంలో శనివారం ఒక ఎన్నికల ప్రచార సభలో యోగి ప్రసంగిస్తూ తమ పార్టీ కేవలం అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, దేశాభివృద్ధే తమ పార్టీ లక్షమని చెప్పారు. ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టడం నిస్సందేహమని, బిజెపి, ఎన్‌డిఎ మిత్రపక్షాలు దేశానికి భద్రతను సమకూరుస్తాయని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి నాయకుడు కాని, విధానం కార్దార్శనికత కాని లేవని, కాంగ్రెస్ మ్యానిఫెస్టో ముస్లిం లీగ్ మ్యానిఫెస్టోలా ఉందని యోగి ఆరోపించారు. ఎస్‌సి, ఎస్‌టిల రిజర్వేషన్లను ముస్లింలకు ధారాదత్తం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. ఔరంగజేబు విధించిన జిజియా తరహాలో ఉందని, ఔరంగజేబు ఆత్మ కాంగ్రెస్‌లో చొరబడిందని యోగి విమర్శించారు.

కాంగ్రెస్, ఇండియా కూటమికి ఎన్నికల్లో గెలవడం దేశాన్ని లూటీ చేయడానికి ఒక మార్గమని ఆయన ఆరోపించారు. బిజెపికి మాత్రం ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్‌ణు తయారుచేయడమేనని ఆయన తెలిపారు. 2014 తర్వాత నుంచి ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని ఆయన చెప్పారు. 2014కి ముందు దేశ సరిహద్దులు అభద్రతతతో, ఉగ్రవాదుల చొరబాట్లు, పేలుళ్లతో దద్దరిల్లేవని యోగి చెప్పారు. 2014కి ముందు దేశంలో ప్రతి హిందు పండుగ ముందు అల్లర్లు జరగడం సర్వసాధారణంగా ఉండేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం 140 కోట్ల భారత ప్రజల మనోభావాలకు ప్రతిరూపమని ఆయన తెలిపారు. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి రాకుండా శ్రీరాముడే చూసుకుంటాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడేవారంతా ఆ దేశానికి వెళ్లిపోయి ఆ దేశంలో భిక్షాటన చేసుకోవాలని యోగి పిలుపునిచ్చారు. ఆ దేశాన్ని కీర్తించే వారికి భారత్‌లో చోటు లేదని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌లో తింటూ పాకిస్తాన్ భజన చేసేవారికి ఈ దేశంలో స్థానం లేదని ఆయన చెప్పారు. పాకిస్తాన్ మొత్తం జనాభా 25 కోట్లు అయితే మోడీ గత పదేళ్లలో భారత్‌లోని 25 కోట్ల మందిని పేదరికం ఉంచి బయటకు తెచ్చారని యోగి చెప్పారు. మౌలికర్యాలకు సంబంధించి మోడీ నాయకత్వంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విస్తారమైన హైవేలను నిర్మించారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News