- Advertisement -
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నాలుగో విడత ఎన్నికల వేళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కీలక ప్రకటన చేశారు. సంరక్షణ కరువైన గోవులను పెంచే రైతులకు వెయ్యి రూపాయలు సాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో గోహత్యలు జరగనీయబోమని అమేథీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు. అక్రమ గోవధ శాలలు తెరవనిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. సంరక్షణ లేని గోవులు రైతుల పంట పొలాలను దెబ్బతీయకుండా చూస్తామన్నారు. మరో వైపు బహ్రెయిచ్ ఎన్నికల ప్రచార సభలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గోవులు రైతుల పంటపొలాలను దెబ్బతీస్తున్నాయని, గోరక్షణ కోసం కేటాయించిన నిధులు దారి మళ్లు తున్నాయని ఆరోపించారు.
- Advertisement -