Thursday, January 23, 2025

యూపి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన సిఎం యోగి

- Advertisement -
- Advertisement -

గోరఖ్‌పూర్ : ఉత్తరప్రదేశ్ లో గురువారం ఉదయం ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు ముందు బ్రేక్‌ఫాస్ట్ తరువాత (పెహలే మత్‌దాన్,,,ఫిర్‌జల్‌పాన్) అన్న నానుడిని ఆయన అక్షరాలా పాటించారు. గోరఖ్‌పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా గోరఖ్‌నాథ్ కన్యా ప్రాథమిక్ విద్యాలయలో మొదటి ఓటరుగా ఉదయం 7.01 గంటలకే తన ఓటును వినియోగించుకున్నారు. “నగరాన్ని స్మార్ట్‌గా, సురక్షితంగా చేయడానికి నగరపాలక ఎన్నికల్లో మన ఓటును వినియోగించుకోవడం కేవలం మన హక్కే కాదు…బాధ్యత కూడా..” అని సూచించారు.

రాష్ట్ర డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని త్రిపుల్ ఇంజిన్‌గా తయారు కాడానికి ఓటర్లు సాయం చేయాలని ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. గురువారం ప్రారంభమైన స్థానిక నగరపాలక సంస్థల మొదటి దశ ఎన్నికల్లో 10 మంది మేయర్లు, 820 మంది కార్పొరేటర్లతోసహా మొత్తం 7593 ప్రజాప్రతినిధులను 37 జిల్లాలకు చెందిన 2.4 కోట్ల మంది ఓటర్లు ఎన్నుకొంటారని ఎన్నికల కమిషన్ వివరించింది. మొత్తం 7362 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఎన్నికలు పార్టీలకు ప్రాథమిక పరీక్షవంటివని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News