Monday, December 23, 2024

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సిబిఐ కోర్టులో శుక్రవారం జరిగింది. డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు జులై 31 నాటికి పూర్తి చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. సిబిఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో వేగం పెరిగింది. సిబిఐ 8 ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ముగిసింది. మరో 3 ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఇడి ఏడు ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ముగిసింది. మరో నాలుగు ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. జులై 31 నాటికి వాదనలు ముగించాలని కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News