Wednesday, January 22, 2025

తెలుగు సాహితీరంగంలో ముగిసిన ‘కేతు’ విప్లవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు సాహిత్యరంగంలో కురువృద్ధులు రాయలసీమ కథకు చిరునామా కేతు విశ్వనాధరెడ్డి(84)కన్నుమూశారు. సోమవారం తెల్లవారు ఝామున గుండెపోటుతో మృతి చెందారు. ఒంగోలులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్ మీద చికిత్స అందించే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం రంగశాయిపురం గ్రామానికి చెందిన కేతు విశ్వనాధరెడ్డి సాహితీవేత్తగా, విద్యావేత్తగా పేరొందారు. రాయలసీమ మాండలికానికి సాహితీ గౌరవం తీసుకొచ్చిన ఘనత దక్కించుకున్నారు. పాత్రికేయ వృత్తితో జీవితం ప్రారంభించి అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు . అంబేద్కర్ సారస్వత్రిక విశ్వవిద్యాలయం డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం దక్కించుకున్నారు.

ఉద్యోగ విరమణ అనంతరం కడపలో భార్యతో కలిసి నివాసం ఉంటున్న కేతు రెండు రోజుల కిందట ఒంగోలులో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లారు. అక్కడే తుది శ్వాస విడిచారు. కేతు మృతి పట్ల ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఆధునిక సాహితీరంగానికి కేతు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విశ్వనాధరెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విశ్వరాధరెడ్డి మృతి పట్ల తెలుగు రా్రష్ట్రాల్లోని పలువురు కవులు , సాహితీవేత్తలు , సంతాపాలు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News