Friday, December 20, 2024

ప్రధాని మోడితో సిఎం జగన్ భేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వివిధ పథకాలు , వాటికి సంబంధించిన నిధులు ఇతర అపరిస్కృత అంశాలను పరిష్కరించాని ప్రధాని నరేంద్రమోడికి ఏపి సిఎం జగన్ విజ్ణప్తి చేశారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధానితోపాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జగన్ భేటీలో దాదాపు 1 గంటా, 20 నిమిషాలసేపు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది.ప్రధానితో సమావేశానికి ముందు కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన సీఎం. దాదాపు 45 నిమిషాలసేపు హోంమంత్రితో సమావేశమయ్యారు. ప్రధానితో సమావేశం తర్వాత కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

న్యూఢిల్లీ పర్యటనను ముగించుకుని సీఎం తిరిగి తాడేపల్లికి సీఎం బయల్దేరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించిన వాటిలో  రాష్ట్ర విభజన సహా అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు.పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని, సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్‌లో ఉందని ప్రధాని దృష్టికి తీసుకుపోయారు.పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా తీసుకెళ్లేందుకు, తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతుందని, ఇది కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉందని ప్రధానికి వివరించారు.

పోలవరం తొలిదశ నిర్మాణానికి, కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే రూ.12911.15 కోట్ల మంజూరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని, ఇది ఇస్తేనే తొలిదశ పూర్తైనట్టని ప్రదానికి వివరించారు. మొత్తంగా పోలవరం తొలిదశ నిర్మాణానికి రూ.17144 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తిచేసిన సీఎం. ఈమేరకు జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంద నిధులతో ఖర్చుచేసిన రూ.1310.15 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాల్సిందిగా కోరారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి పై రెండు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తిచేసారు.2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిలు అలాగే పెండింగులో ఉన్నాయని పీఎంకు తెలిపారు.

ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగులో ఉందని, ఏపీ జెన్‌కో ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా ఈ బకాయిలు వచ్చేలా దృష్టిపెట్టాలని ప్రధానమంత్రిని కోరారు.జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించిన విషయాన్ని మరోసారి ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయారు.ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతాచట్టం కింద కనీసంగా వంద శాతం అధికంగా కవరేజీ ఉందని, పథకం అమలుకు ఎంచుకున్న ప్రమాణాల్లో హేతుబద్ధత లేదని పీఎంకు వివరించిన సీఎం. నీతిఆయోగ్ కూడా దీన్ని నిర్ధారించిందని తెలిపారు.రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కకుండా పోతోందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోందని, సత్వరమే జోక్యంచేసుకోవాలని ప్రధానమంత్రిని కోరారు.

ప్రతినెలా వినియోగించకుండా దాదాపు లక్ష టన్నుల బియ్యం కేంద్రం వద్ద ఉంటోందని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి ఇస్తే సరిపోతుందని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు పెండింగులో ఉన్నాయిన ప్రధాని దృష్టికి తీసుకు పోయారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా దోహదపడుతుందని, రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, ఈమేరకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తిచేసారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశామని, ప్రతి జిల్లాకు కనీసంగా 18 లక్షల జనాభా ఉందని ప్రధానికి తెలిపారు.ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 11 కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలను చేపట్టామని వెల్లడించారు.ఈ కాలేజీలకు తగిన ఆర్ధిక సహాయం చేయాలని కోరారు.

వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర హామీ ఇచ్చిందని, వెనకబడ్డ రాయలసీమ ప్రాంతంలో జీవనోపాధి మెరుగుపడ్డానికి, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరమని పీఎంకు తెలిపారు.
స్టీల్‌ప్లాంట్‌కు అత్యంత అవసరమైన ముడి ఖనిజంకోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించేలా కేంద్ర గనులశాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేసారు.ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరుచేయాల్సిందిగా ప్రధానమంత్రిని కోరారు.2012-13 నుంచి రూ. 2017-18 వరకూ ఇవి పెండిగులో ఉన్నాయని సీఎం జగన్ ప్రధానికి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News