Monday, January 20, 2025

సిఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: జిల్లాలో సిఎంఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువులోపు పూర్తిచేసి ఎఫ్‌సిఐకి అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. శుక్రవారం సూర్యాపేటలెక్టరేట్‌లో తన ఛాంబర్‌నందు రైస్ మిల్లర్లు, ఎఫ్‌సిఐ, సివిల్ స ప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మిల్లర్లకు కెటాయించిన సిఎంఆర్ డెలవరీ చేసేందుకు సరిపడా గోదాములు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కలెక్టర్ దృష్టికి మిల్లర్లు తీసుకురావడంతో బియ్యం నిల్వలకు సరిపడా గోదాములను ఏర్పాటు చేయాలని ఎఫ్‌సిఐ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

సిఎంఆర్ డెలవరీలో ఎలాంటి ఇ బ్బందులు లేకుండా చూడాలని అన్నారు. రబి, ఖరీఫ్ సీజన్లకు నాలుగు ల క్షల మెట్రిక్ టన్నుల సామర్ధం గల గోదాము కావాల్సి ఉందని, ముందుగా 77వేల మెట్రిక్ టన్నుల నిల్వలకు సరిపోను స్థలాన్ని కేటాయిస్తామని, మిగిలిన బియ్యం నిల్వలకు త్వరలోనే గోదాములు కేటాయిస్తామని ఎఫ్‌సిఐ అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా మిల్లర్ల అసోసియేష న్ అధ్యక్షులు సోమనర్సయ్య మాట్లాడుతూ వర్షాలు, హమాలీల కొరత, రై ల్వే వేగన్స్ సకాలంలో రాకపోవడంతో సిఎంఆర్ బియ్యాన్ని సకాలంలో అ ందించలేకపోతున్నామని తెలిపారు.

ఎఫ్‌సిఐ అధికారులు తరచుగా తనిఖీలు చేయడంతో దిగుమతులలో జాప్యం జరగడంతోనే ప్రభుత్వం కేటాయించిన సిఎంఆర్ లక్ష్యాన్ని మిల్లర్లు చేరుకోవడం లేదని ఈ సందర్భంగా కలెక్టర్‌కు తెలిపారు. సెప్టెంబర్ చివరి వరకు కేటాయించిన సిఎంఆర్ లక్ష్యాల మేరకు అందిస్తామని మిల్లర్లు కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌సిఐ ఏరియా మేనేజర్ వరుణ్ సూద్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఏ.వెంకట్ రెడ్డి, హుజూర్‌నగర్ ఆర్డిఓ జగదీష్ రెడ్డి, డిసిఎంఎస్ ఛైర్మన్ జానయ్య, డిఎం సివిల్ సప్లై రాంపతి, పుల్లయ్య, రైస్ మిల్లర్ యజమానులు, ఎఫ్‌సిఐ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News