Sunday, January 19, 2025

31వ తేదీలోగా ఎఫ్‌సిఐకి సిఎంఆర్ బియ్యం

- Advertisement -
- Advertisement -

42లక్షల టన్నులు అందజేయాలి.. జాప్యం చేస్తే మిల్లర్లపై కఠిన చర్యలు

మన తెలంగాణ/హైదరాబాద్:  ఈ నెల చివరినాటికి భారత ఆహార సంస్థ(ఎఫ్‌సిఐ)కి 42లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాలని అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కస్టమ్ మి ల్లింగ్ రైస్ ఎఫ్‌సిఐకి అందజేయడంలో మిల్లర్లు జాప్యం చేస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హె చ్చరించారు. అప్పగింతను వేగవంతం చేయలని ఆదేశించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డి ఎస్ చౌహాన్ ఇతర అధికారులతో కలిసి డా. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ, ఎఫ్‌సిఐ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కస్టమ్ మిల్లింగ్‌ను వేగవం తం చేయడంపై దృష్టి సారించాలని రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం మరియు దానిని ఎఫ్‌సిఐకి అం దజేయాలని అన్నారు, పౌర సరఫరాల శాఖ నుంచి ఎఫ్‌సిఐకి పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మి ల్లింగ్ బియ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో అక్కడ కేంద్ర ప్రభుత్వ అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, అయితే డెలివరీలలో పని తీరు తక్కువగా ఉందని ఫిర్యాదు చేశారని వివరించా రు.

పౌర సరఫరాల సంస్థ జనవరి 31 నాటికి 7.83 లక్షల మెట్రిక్ టన్నుల వానాకాలం బియ్యం, యాసంగి సీజన్‌కు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సిన విషయాన్ని మంత్రి నొక్కి చెప్పారు. దీని కోసం తెలంగాణ మిల్లర్లందరూ రాబోయే రోజుల్లో దాదాపు 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందని అన్నారు. రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందించేందుకు పౌర సరఫరాల సంస్థ రుణాలు తీసుకున్న విషయాన్ని మంత్రి ఎత్తిచూపారు. పెట్టుబడిని తిరిగి పొందడం అనేది మిల్లర్లు అవసరమైనంత, ఎఫ్‌సిఐకి బియ్యాన్ని పంపిణీ చేయడంపై ఆధారపడి ఉంటుందని అయితే, ఇటువంటి జాప్యం వల్క కార్పొరేషన్‌కు పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించాయని అన్నారు. గత పదేళ్లలో రూ. 58,000 కోట్ల అప్పులు , రూ. 11,000 కోట్ల నష్టాలు సివిల్ సప్లైపై భారం పడిందని అన్నారు. అదనంగా, ఇది దాదాపు రూ. 3,000 కోట్ల వార్షిక వడ్డీ భారాన్ని వేస్తుందని అన్నారు.. సకాలంలో బియ్యం పంపిణీ చేయకుండా మిల్లర్లు పెద్దఎత్తున నిల్వలు ఉంచుకోవడం వల్ల లాభం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

నిర్ణీత పరిమాణంలో సిఎంఆర్ బియ్యాన్ని పంపిణీ చేయడంలో జాప్యం చేయడం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు కేటాయింపులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఎఫ్‌సిఐకి సకాలంలో బియ్యం పంపిణీ చేసేందుకు విధానాలను మెరుగుదల , ప్రక్రియను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. రైతులకు, రాష్ట్ర ఆర్థిక , పౌర సరఫరాల కార్పొరేషన్ యొక్క భవిష్యత్తు కోసం బియ్యం పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. లక్ష్యం గడువుకు 21 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, లక్ష్యాన్ని సాధించడానికి రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. దీనికి తోడు పిడిఎస్ బియ్యం నాణ్యత లోపించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్రాలు కిలో రూ.39కి కొనుగోలు చేసిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేయడం లేదా ఇతర అవసరాలకు మళ్లించడం జరుగుతోందని ఆయన గుర్తించారు. పిడిఎస్ బియ్యాన్ని ‘పవిత్రమైనది‘గా పేర్కొంటూ, పేదలను చేరుకోవడంలో , వాణిజ్యీకరణను నిరోధించడంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు.

అధిక ధరలకు ఎగుమతి చేసేందుకు మిల్లర్లు పిడిఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి రీసైక్లింగ్ చేస్తున్నారనే వార్తలను ప్రస్తావించగా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి కేసులను అత్యంత సీరియస్‌గా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో బియ్యం బస్తాకు నాలుగైదు కిలోల తక్కువ బియ్యం అందుతున్నట్లు రేషన్ షాపు యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదును కూడా మంత్రి ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రేషన్ షాపుల యజమానులు ఎందుకు నష్టపోవాల్సి వస్తుందని, దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదిలావుండగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్, ఇతర అధికారులు జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో లక్ష్యాలు, విజయాల గురించి అడిగి తెలుసుకున్నారు. తక్కువ కొనుగోళ్లు ఉన్న జిల్లాల్లోని కలెక్టర్లు ఎఫ్‌సీఐకి పంపిణీ చేసిన బియ్యం లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News